హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో.. నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం నుంచి 28వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ తెలిపారు.