కూకట్ పల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 24 మంది లబ్దిదారులకు రూ. 10, 30, 000 విలువ గల చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబాలకు అందజేశారు. నియోజకవర్గంలో పేద ప్రజలను ఆదుకునేందుకు తను ఎప్పుడూ ముందుటానన్నారు. ఎటువంటి సహాయం అయినా తనను నేరుగా అడగవచ్చని తెలిపారు.