రాష్ట్ర ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు నిరసన చేపట్టారు. రాష్ట్రానికి విద్యామంత్రి లేరని, ముఖ్యమంత్రికి విద్యావ్యవస్థపై పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు.