హైదరాబాద్లో బీజేపీ చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గం గోల్నాకకు చేరుకున్నారు. తులసి రాం నగర్ బస్తీలో పర్యటిస్తూ బాధితులు, స్థానికులతో మాట్లాడుతున్నారు. మూసీ బాధితులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన వారికి భరోసా ఇస్తున్నారు. రాత్రికి బస్తీ వాసులతో కలిసి భోజనం చేయనున్న కిషన్, ఆ తర్వాత అక్కడే నిద్ర చేయనున్నారు.