మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతిలేని టింటెడ్ గ్లాస్ వాడుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగుతోందని ట్రాఫిక్ ఎస్‌ఐ రాము తెలిపారు. వాహనదారులకు టింటెడ్ గ్లాస్ తొలగించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు.