మలక్ పేట్ లోని శ్రీకృష్ణ మార్కెట్ లో సరైన రోడ్డు వస్తి లేక వ్యాపారస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎక్కువగా వ్యాపారాల జరిగే చోట కనీస వసతులు కల్పించేలా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న మట్టి రోడ్డు కూడా సరిగా లేకపోవడంతో వ్యాపారాలు చేసుకునేందుకు ఇబ్బందికరంగా మారిందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి నూతనంగా రోడ్డు వేయాలని కోరుతున్నారు.