హైదరాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో బుధవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మొండా మార్కెట్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక, నాయకులతో కలిసి ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.