వరద బాధితుల సహాయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11, 06, 83, 571 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. పోలీస్ అకాడమీలో జరిగిన ఎస్ఐలు, ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించి చెక్కును హోం సెక్రెటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి , పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందించారు.