మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

83చూసినవారు
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారిని మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మల్లారెడ్డిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బోనాల పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్