టి-హాబ్ తో హోలీ మారి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల కి మధ్య కుదిరిన ఎమ్ఒయూ ఒప్పందం

382చూసినవారు
టి-హాబ్ తో హోలీ మారి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల కి మధ్య కుదిరిన ఎమ్ఒయూ ఒప్పందం
కీసర మండల పరిధిలోని బొంగరం లో ఉన్న హోలీమారి ఇంజనీరింగ్ కళాశాల తో టి- హాబ్ ఎమ్ ఒ యూ ఒప్పందం కుదుర్చు కోవడం జరిగింది. ఈ సందర్బంగా టి - హాబ్ సి ఈ ఒ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఆలోచనతో రండి. ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్ లకు ఇంక్యుబేటర్ గా తీర్చిదిద్దనున్న టీ-హబ్ యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టు టీ హబ్ ప్రోగ్రామ్ ని వినియోగగించు కోవాలని సూచించారు. అనంతరం చైర్మన్ మరియు డైరెక్టర్ మాట్లాడుతూ కొత్తగా స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని, కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవటం ద్వారా ఎన్నో ఆవిష్కరణలకు బాటలు పడే అవకాశం ఉందని దిశ నిర్ధేశం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టి - హాబ్ సిఈఒ శ్రీనివాసరావు మహాoకాలి, కాలేజీ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి అరీమంద, డైరెక్టర్ డా. పి భాస్కర్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్