ఆహార నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ: డిప్యూటి మేయర్

79చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ సందర్శన కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి శనివారం బోడుప్పల్ లోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. ముఖ్య అతిథిగా హాజరై కమాన్ డైట్ మేనూను డిప్యూటి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. విద్యార్థుల ఆరోగ్యం, ఆహార నాణ్యత, విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్