హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్ 177, సెంట్రల్ జోన్ 102, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆటోలతో విన్యాసాలు చేస్తూ యువకులు హల్‌చల్ చేశారు.