సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు. నాయకులు పాల్గొన్నారు.