బొలక్ పూర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ సభ లైన్ లో సివరెజీ లైన్ ఓవర్ స్లో అవుతోంది. దీంతో రోడ్డుపై మురుగు నీరు చేరి దుర్వాసన వస్తోంది. స్థానిక వ్యాపారస్తులకు, నీవాసితులకు ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ముక్కు మూసుకుని ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది స్పందించి మరమ్మతులు చేపట్టాలని, మరోసారి సమస్యలు రాకుండా చూడాలని కోరుతున్నారు.