గాంధీ ఆస్పత్రికి మరో కరోనా అనుమానితుడు

8553చూసినవారు
గాంధీ ఆస్పత్రికి మరో కరోనా అనుమానితుడు
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో కరోనా వ్యాధి లక్షణాలతో ఉన్న ఒక వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించారు నాంపల్లి రైల్వే పోలీసులు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తికి క్వారన్ టైన్ లో ఉండాలని చేతికి స్టాంప్ వేసి ఉంది. ఆ వ్యక్తి నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి వచ్చిన రైల్వే పోలీసులు అతనిని గాంధీకి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్