జిహెచ్ఎంసి ఏంటమాలజీ సిబ్బంది పని తీరుపై మల్లేపల్లి డివిజన్ కార్పొరేటర్ జాఫర్ ఖాన్ అరా తీశారు. గురువారం వారితో సమావేశమై హాజరు శాతంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి కార్పొరేటర్ పలు సూచనలు చేశారు. డివిజన్ పరిధిలో పకడ్బందీగా యాంటీ లార్వా ఆపరేషన్, దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.