ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ. ఐఎన్టీయూసీ అనేక పోరాటాలు చేసి సాధించిన కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4కోడ్లుగా విభజించిందని ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం వచ్చే మార్చిలో నిజాం కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.