కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వాన పత్రికలు, వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.