కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చింతల్ డివిజన్ రంగా నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మరియు సంక్షేమ సంఘం సభ్యులు బుధవారం ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీలలో గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో మౌలిక వసతులను కల్పించామన్నారు.