రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. అనాథాశ్రమంలో కేర్ టేకర్ సునీత బాలికలతో అసభ్యంగా ప్రవర్తించింది. సునీత చిత్రహింసలు పెడుతూ దుస్తులు విప్పించి ఆశ్రమంలో పనిచేసే పురుషుల ముందు నిల్చోపెడుతున్నట్లు బాలికలు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ పోలీసులకు, షీటీమ్స్‌కు కంప్లైంట్ చేశారు. పోలీసులు సునీతను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.