మద్యం మత్తులో కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. బుద్వేల్ ప్రాంతానికి చెందిన పాముల రఘు రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పని నిర్వహిస్తున్నాడు. కాటేదాన్ కల్లు కంపౌండ్ లో కల్లు సేవించి కంపౌండ్ వాల్ లో పక్కన కిందపడి మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.