పద్మారావు గెలుపు దిశగా తలసాని పోరాటం

66చూసినవారు
పద్మారావు గెలుపు దిశగా తలసాని పోరాటం
రాజకీయంలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంటారు. దీనికి ప్రస్తుత సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రా బాద్ పార్లమెంట్ భారాస అభ్యర్థి టి.పద్మారావుగౌడ్ ఉదాహరణ. కార్పొరేటర్లు, శాసన సభ్యత్వాల కోసం ఒకనాడు హోరాహోరి తల పడిన వీరు ప్రస్తుతం మిత్రులుగా మారారు. వీరిద్దరు 1986లో రాజకీయ అరంగేట్రం చేశారు. మోండా డివిజన్ నుంచి కార్పొరేషన్ ఎన్నికల్లో తలపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మారావుగౌడ్ గెలుపొందారు. 2004లో సికింద్రాబాద్ అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా తలసాని, తెరాస అభ్యర్థిగా పద్మారావు పోటీ పడ్డారు. ఈ పోటీలో పద్మారావు గౌడ్ గెలిచారు. మళ్లీ 2008 ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా తలసాని, తెరాస అభ్యర్ధిగా పద్మ రావు మరోసారి ఢీకొన్నారు. తలసాని గెలి చారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో తలసాని తెరాసలో చేరడంతో ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ భారాస ఎంపీ అభ్యర్ధి పద్మ రావుగౌడ్ గెలుపు కోసం తలసాని కృషి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్