రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని ప్రజాభవన్ దగ్గర రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత దళిత బంధు నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. లేకపోతే నిరసనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అప్రమత్తమైన పోలీసుకు వారిని అరెస్ట్ చేసి ఎస్సాఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.