నిత్యం డ్యూటీలో బిజిగా ఉండే సిటీ సీపీ సీసీ ఆనంద్ కాస్తా రిలాక్స్ అయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన పతంగులను ఎగురవేశారు. తాను గాలిపటాలు ఎగురవేయడం ఇదే మొదటి సారి అని, చాలా సంతోషం కలిగించిందన్నారు. అనంతరం నగర ప్రజలకు సీపీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గాలిపటాలను జాగ్రత్తగా ఎగురవేయలని ప్రజలకు సూచించారు.