బోయిన్ పల్లి: 'అంబేడ్కర్ విగ్రహ అలంకరణ విస్మరించిన అధికారులు'

85చూసినవారు
తెలంగాణలో అతి పెద్దదైన బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ. ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారులు అలకరించలేదు. శుక్రవారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని చూసిన ఎమ్మార్పీఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఇటుక కిషన్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహ అలంకరణను ఎలా మర్చిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్