వరుసగా బైకుల దొంగతనానికి పాల్పడుతున్న నిందితులను ఎట్టకేలకు చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిలకలగూడ పీఎస్ పరిధిలో 4, మేడిపల్లి పరిధిలో 3, ఉప్పల్ పరిధిలో 2 మొత్తం రూ. 9 లక్షల విలువ చేసే 9 బైకులను స్వాధీనం చేసుకొని, దొంగను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందికి రివార్డులను అందచేశారు.