డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాల సందర్భంగా మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశని నిర్వహించారు. ఈ సమావేశంనికి వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు.
మాదిగ మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, అరుంధతి బంధు సొసైటీ చైర్మన్ డాక్టర్ పల్లెల వీరస్వామి, ప్రొఫెసర్లు డాక్టర్ నతనియోల్, డాక్టర్ పురుషోత్తం, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ వనపర్తి జిల్లా సభ్యులు గంధం నాగరాజు మాదిగ, తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దొమ్మాటి శివకుమార్ మాదిగ, తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ మీసాల ఎల్లేశ్ మాదిగ లు మాట్లాడుతూ
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై,
కేంద్ర మంత్రిగా ఉండి, ఎన్నో సంస్కరణాలు, చట్టాలను అమలు చేసిన, భారత ఉప ప్రధానమంత్రి అని ఆయన సేవలను కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ రైటర్ అయితే, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఒక ఫైటర్ అని తెలిపారు. అంబేద్కర్ గారు హక్కుల కోసం కోసం పోరాటం చేస్తే,వాటిని అమలు అయ్యే విధంగా పార్లమెంట్ లో మంత్రిగా ఉండి, ఆ చట్టలను అమలయ్యే విధంగా పార్లమెంట్లో అందరితో ఫైట్ చేసి, అమలు చేసిన ఘనత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని వారు తెలిపారు.
కాబట్టి రాష్ట్ర సచివాలయలనికి సమీపంలో అంబేద్కర్ విగ్రహం పక్కన,డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, మాదిగ, మాదిగ ఉపకులాల సంఘాల నాయకులు సమక్షంలో, తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిలక భాస్కర్, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బోర్ర రామచంద్రరావు మాదిగ, మెదక్ జిల్లా సభ్యులు లక్ష్మణ్ మాదిగ, వివిధ జిల్లాలకు సంబంధించిన మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.