యూపీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. రాయ్‌బరేలీ జిల్లా అసహాన్ జగత్‌పూర్‌లో ఓ రేకుల ఇంటి పైకప్పు కూలడంతో.. అష్రఫీ బేగం అనే మహిళ శిథిలాల కింద చిక్కుకొని మరణించింది. ప్రార్థన అనంతరం ఆమె ఒంటరిగా లోపలి గదికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు.