కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని BRS మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం 17,516 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, ఫిజికల్ టెస్టులు, ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించిందని .. కానీ ఎన్నికల కారణంగా నియామకాలు పూర్తి కాలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటోందని ఆరోపించారు.