రహదారులపై ఇష్టారాజ్యంగా చెత్త చెదారాలు, వ్యర్థ పదార్థాలను పారేస్తున్న వ్యక్తులను గుర్తించి జరిమానాలు విధిస్తామని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ హెచ్చరించారు. ఇందుకోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. బుధవారం డివిజన్ పరిధిలో చెత్త డంపింగ్ కేంద్రాలుగా మారుతున్న నాలుగు ప్రాంతాలను పరిశీలించారు. శానిటేషన్ డీఈ వెంకటేశ్ పాల్గొన్నారు.