మోండా మార్కెట్: భక్తిశ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని మోండా మార్కెట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దీపిక అన్నారు. బుధవారం డివిజన్ పరిధి పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దేవి మండపాన్ని కార్పొరేటర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొన్నారు.