రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంత కుమారిని శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిహెచ్ఎంసి లో కంటోన్మెంట్ విలీన ప్రక్రియ పై ప్రస్తుత స్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వైఖరి ఏమిటో తెలియాలని ఆమె చెప్పినట్లు ఎమ్మెల్యే చెప్పారు. డిసెంబర్ 4న జరగబోయే వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.