నకిలీ సర్టిఫికేట్ వైద్యుని అరెస్టు

80చూసినవారు
నకిలీ సర్టిఫికేట్ వైద్యుని అరెస్టు
సికింద్రాబాద్లో నకిలీ డాక్టర్ గుట్టును ఔషద నియంత్రణ అధికారులు రట్టు చేశారు. తుకారంగేట్ వద్ద యువ క్లినిక్ పేరుతో వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి నకిలీ రిజిస్ట్రేషన్, నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో వైద్యం చేయడం మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేసి అతడిని తుకారం గేట్ పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి రూ.2లక్షల విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్