సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది. మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఆమె అప్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్ ను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్ కి అతడిని తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.