తార్నాక లోని డిప్యూటి మేయర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బతుకమ్మ, దసరా నవరాత్రుల ఏర్పాట్లపై డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ట్రాపిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, పందిరులు, నీటి సౌకర్యాలు, భద్రత చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మేయర్ సూచించారు.