ఫెన్సింగ్ లేక ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్

52చూసినవారు
బన్సీలాల్ పేట డివిజన్ ఐడిహెచ్ కాలనీలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని, ఒకవేళ షాక్ కొడితే ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ నిర్మించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్