బీదల బస్తీలో ఫ్రైడే డ్రై డే ర్యాలీ

63చూసినవారు
బీదల బస్తీలో ఫ్రైడే డ్రై డే ర్యాలీ
కుట్టివెల్లోడి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీదలబస్తీలో ప్రైడే- డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, దోమల వ్యాప్తి అంశంపై స్థానికులకు అవగాహన కల్పించారు. వానకాలంలో మలేరియా, డెంగ్యూ లాంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిధిలో నీరు నిల్వ లేకుండా, పొడిగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్లకార్డులు, బ్యానర్లతో బస్తీలో ర్యాలీ చేశారు.

సంబంధిత పోస్ట్