సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మొబైల్ దొంగతనానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని, దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా వారు పేర్కొన్నారు.