సికింద్రాబాద్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

60చూసినవారు
సికింద్రాబాద్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైలు పట్టాల పక్కనే నడిచి వెళ్తున్న వ్యక్తిని (35) రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్- జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి 7.15 గంటల సమయంలో ఓ వ్యక్తి మృతదేహం రైలు పట్టాల పక్కన పడి ఉందని జీఆర్పీ పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

సంబంధిత పోస్ట్