అమృత్ టెండర్లలో అక్రమాలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన సవాల్‌కు కేటీఆర్ సమాధానం చెప్పలేక దాటవేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. రాజీనామా చేయాల్సి వస్తుందని భయపడే సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.