జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

84చూసినవారు
జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయగా తాజాగా సీన్ లోకి మహిళా కమిషన్ ఎంటర్ అయింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన జానీపై చర్యలు తీసుకోవాలని బుధవారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు మహిళా సంఘం సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు విచారణను పోలీసులు వేగవంతం చేసిన తరుణంలో మరోవైపు మహిళా సంఘం కమిషన్ కు ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్ పై ఆరోపణల వ్యవహారంలో ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

సంబంధిత పోస్ట్