ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని తద్వారా చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ అన్నారు. గురువారం తార్నాక డివిజన్ లో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసారు. డిప్యూటి మేయర్ మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాలను తీసుకుని వొచ్చి ప్రతీ ఒక్కరూ పూజలు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ లో మనం కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.