78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నాచారం సావర్కర్ నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్, హన్మంత్ బిరాదర్, నవీన్ గౌడ్, గోపి, ఓరుగంటి వెంకటేష్ పాల్గొనటం జరిగింది.