నగరంలో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్, హయత్ నగర్, సికింద్రబాద్ రైల్వే స్టేషన్, చాంద్రాయణగుట్ట, వనస్థలిపురం, అత్తాపూర్, బాలాపూర్, మెహిధిపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా ఎక్కడిక్కడ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు లైసెన్స్ సహా ఇతర పత్రలు లేని వారిపై చర్యలు చేపట్టారు.