వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. గురువారం వికారాబాద్ అనంతగిరి అడవుల్లో వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా వన్యప్రాణులను కాపాడే విధానంపై అవగాహన కల్పించారు. అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ వారోత్సవాలు అక్టోబర్ 2 నుండి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు.