హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు బాధితుల ఫిర్యాదులు

64చూసినవారు
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు బాధితుల ఫిర్యాదులు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు బాధితుల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి. శుక్రవారం అమీన్ పూర్ కు చెందిన కొంతమంది రంగనాథ్ ను కలిశారు. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటేశ్వరరావు అనే వ్యక్తులు తమను మోసం చేసి ప్రభుత్వ భూములు కట్టబెట్టరాని ఫిర్యాదు చేశారు. అమీన్ పూర్ పరిధిలోని సర్వే నం.6 అనుమతులు చూపించి సర్వే నం. 12కు చెందిన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి తమకు అమ్మారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్