ఓల్డ్ బోయిన్ పల్లి: డ్రైనేజీ మరమ్మతులు ఎప్పుడో

58చూసినవారు
ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్ పేట్ లో ఇన్ టౌన్ కాలనీ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో కాలనీవాసులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు నుంచి నడవాలంటే తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు రాకపోకలకూ ఇబ్బందిగా మారింది. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యకు తగు చర్యలు చేపట్టాలని శుక్రవారం కాలనీవాసులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్