ఎమ్మెల్యేగా పోటీ చేసింది.. గంజాయి అమ్ముతూ అడ్డంగా చిక్కింది

52చూసినవారు
2023 ఎలక్షన్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆసియాతస్నిం సుల్తానా గంజాయి అమ్ముతుండగా బుధవారం అరెస్ట్ చేశామని హైదరాబాద్ కంచన్ బాగ్ పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని హాఫీజ్ బాబానగర్ సి బ్లాక్లో నివసించే ఆసియాతస్నిం సుల్తానా గత ఎలక్షన్లో చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీపై పోటీ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్