హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌కు GHMC నుంచి నిర్మాణ అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. తమ్మిడికుంట చెరువు FTL, బఫర్‌జోన్లలోని ఆక్రమణలను హైడ్రా, GHMC, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేసినట్లు తెలిపారు. తమ్మిడికుట చెరువులోని అనధికార నిర్మాణాల్లో N కన్వెన్షన్ ఒకటన్నారు. చెరువులోని FTLలో ఎకరా 12 గుంటలు.. బఫర్ జోన్‌లోని 2 ఎకరాల 18 గుంటల్లో N కన్వెన్షన్ ని నిర్మించారని చెప్పారు.