హైదరాబాద్ కూకట్ పల్లిలోని నల్లచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలు ఆపాలని వేడుకుంటూ ఓ మహిళ అధికారుల కాళ్లు పట్టుకుంది. మరికొంతమంది తమకు సమయం ఇవ్వాలని కోరుతూ రోదించారు. నిర్మాణాలు కట్టడానికి అధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.